మ్యాక్స్ వెల్ ను ప్లాన్ చేసి అవుట్ చేశా: బౌలర్

Thursday, September 28th, 2017, 01:55:06 AM IST

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఛాంపియన్స్ ట్రోపి ఫైనల్ లో ఓటమి దెబ్బను మరిపిస్తూ అగ్ర దేశాలను సైతం ఓడిస్తూ అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది. గత కొన్ని రోజులు క్రితం శ్రీలంక జట్టుతో వరుస విజయాలను నమోదు చేసుకున్న ఇండియా ఇప్పుడు ఆస్ట్రేలియా వంటి స్ట్రాంగ్ జట్టును కూడా ఏ మాత్రం కోలుకోనివ్వకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. 5 వన్డేల సిరీస్ లో ఇప్పటికే మూడు వన్డేలను గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోంది. అయితే ఆస్ట్రేలియా మిగతా రెండిటిని గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. అయితే భారత్ మూడు వన్డేల్లో గెలవడానికి కరెక్ట్ ప్రణాళికలతో వెళ్లడమే అని అర్ధమవుతోంది.

ఎందుకంటే భయంకర ఆస్ట్రేలియా ఆటగాళ్లని మన బౌలర్లు అనుకున్న టైమ్ కి కరెక్ట్ గా పెవిలియన్ బాట పట్టించారు. ముఖ్యంగా భయంకర ఆటగాడు మాక్స్ వెల్ ను అవుట్ చేసేందుకు ముందు నుంచే మన బౌలర్లు ఒక ప్రణళికతో వెళ్లారట. అయితే అతన్ని మూడు వన్డేల్లో ఈజీగా అవుట్ చేసి సత్తా చాటాడు యజువేంద్ర చాహల్‌. అతన్ని అవుట్ చెయ్యడానికి మూడు డాట్ బాల్స్ చాలని చాహల్ అంటున్నాడు. మాక్స్‌వెల్‌ ను అవుట్ చేయాలంటే ముందుగా బంతిని స్టంప్స్‌ వైపు వేయకుండా అవుట్‌ సైడ్‌ స్టంప్స్‌కు వేస్తాను. రెండు నుంచి మూడు బంతులు డాట్‌ అయ్యేలా చూసుకోవాలి. దీంతో మాక్స్‌వెల్‌ ఓపిక నశించి క్రీజు వదలి భారీ షాట్‌కు ప్రయత్నిస్తాడు. అప్పుడు వికెట్ కీపర్ స్టంప్ అవుట్ కి బాలవ్వక తప్పదని..చెబుతూ.. రెండు సార్లు ఈ ప్రణాళికలు సక్సెస్ అయ్యాయని చాహల్ వివరించాడు.

  •  
  •  
  •  
  •  

Comments