షాక్ .. నాగ చైతన్య కు సినిమా కష్టాలు ?

Wednesday, September 27th, 2017, 12:38:13 PM IST


లేటెస్ట్ గా యుద్ధం శరణంతో నిరాశలో ఉన్న నాగ చైతన్య కు మరో తలనొప్పి మొదలైంది. ప్రేమమ్, రారండోయ్ సినిమాల విజయంతో మంచి ఊపుమీదున్న చైతు ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా మొదలు పెట్టాడు. తనతో ప్రేమమ్ లాంటి హిట్ సినిమా తీసిన దర్శకుడు కావడంతో రెండో ఛాన్స్ ఇచ్చిన చైతు ..శరవేగంగా షూటింగ్ ని మొదలు పెట్టాడు కూడా . ఇక యుద్ధం శరణం సినిమా పై భారీ ఆశలే పెట్టుకున్నా చైతు కు ఆ సినిమా పరాజయం కావడంతో నెక్స్ట్ సినిమాతో హిట్ కొట్టాలనే కసితో ఉన్న చైతూకు టెన్షన్ పెట్టేలా సవ్యసాచి కథ తనదే అంటూ రచయితా డైమండ్ రత్నబాబు కేసు వేసాడు ? ఈ కథ తనది అంటూ ఆయన దర్శకుల అసోసియేషన్ లో పిర్యాదు చేయడంతో ఈ కేసు తేలేవరకు సినిమా మొదలు పెట్టొద్దని చందు మొండేటి కండిషన్స్ పెట్టారట ? దాంతో ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ సినిమా షూటింగ్ కాకుండా ఆగిపోయింది !! మరి ఈ కథ విషయంలో చందు ఎలాంటి జవాబు ఇస్తాడా అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. చూద్దాం ఏమి జరుగుతుందో ?

  •  
  •  
  •  
  •  

Comments