మోహ‌న్‌రంగ‌ చివ‌రికిలా!

Thursday, April 12th, 2018, 09:57:12 PM IST

నితిన్ `ఛ‌ల్ మోహ‌న్‌రంగ‌` రిలీజై రెండో వారంలో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికి ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటి? హిట్టా? ఫ‌ట్టా? అన్న‌ది వెరిఫై చేస్తే, ఈ సినిమా ఏకంగా డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ అందుకుంద‌ని ట్రేడ్ చ‌ర్చిస్తోంది.

20 కోట్ల‌కు థియేట్రిక‌ల్ రైట్స్‌ని విక్ర‌యిస్తే, మొద‌టి వారంలో 15కోట్ల గ్రాస్, 8 కోట్లు షేర్ మాత్ర‌మే వ‌సూలైంది. షేర్ వివ‌రాలు ప‌రిశీలిస్తే.. నైజాం-2.55 కోట్లు, ఏపీ-2.50కోట్లు, ఇరు రాష్ట్రాల్లో క‌లిపి -5.7కోట్లు వ‌సూలైంది. అమెరికా స‌హా ఇత‌ర‌చోట్ల వ‌సూళ్లు క‌లుపుకుని మొత్తం 7.5కోట్ల షేర్, నైజాం, ఏపీ క‌లుపుకుని 10.5కోట్లు గ్రాస్ వ‌సూలు చేసిన ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్ 15కోట్ల మేర గ్రాస్ వ‌సూలు చేసింది. నైజాం నుంచి 4.8 కోట్లు గ్రాస్‌ వ‌సూలైంది. `రంగ‌స్థ‌లం` హ‌వా ఓవైపు, నేడు రిలీజైన కృష్ణార్జున యుద్ధం ఎదురుదాడి నితిన్‌కి పెద్ద డిజాస్ట‌ర్‌ని మిగిల్చాయ‌ని రిపోర్ట్ అందింది.