రివ్యూ రాజా తీన్‌మార్ : ఛల్ మోహన్ రంగ – పంచులు, ప్రాసలు తప్ప ఎమోషన్ లేదు

Thursday, April 5th, 2018, 04:30:58 PM IST

తెరపై కనిపించిన వారు : నితిన్, మేఘా ఆకాష్
కెప్టెన్ ఆఫ్ ‘ఛల్ మోహన్ రంగ’ : కృష్ణ చైతన్య

మూల కథ :

ఎలాగైనా అమెరికా వెళ్లి స్థిరపడాలనుకునే మోహన రంగ (నితిన్) అనేక ప్రయత్నాలు చేసి అమెరికా వెళ్తాడు. అక్కడే మేఘా సుబ్రహ్మణ్యం (మేఘా ఆకాష్) అతనికి పరిచయమవుతుంది. తక్కువ కాలంలోనే ఇద్దరూ స్నేహితులైపోతారు.

ఒక దశలో ప్రేమలో పడతారు కూడ. కానీ ప్రేమని వ్యక్తపరుచుకోకుండానే విడిపోతారు. అప్పటి నుండి ఎవరికీ ప్రశాంతత ఉండదు. అలా దూరమైన ఇద్దరూ తిరిగి ఎలా కలుసుకున్నారు అనేదే సినిమా.

విజిల్ పోడు :

  •  హీరో నితిన్ మోహన్ రంగ పాత్రలో కొత్తగా కనబడ్డాడు. అనేగాక ఆ పాత్రలో ఆయన నటించితిన్ తీరు, హాస్యం పండించిన విధానం బాగా ఆకట్టుకున్నాయి. కాబట్టి మొదటి విజిల్ ఆయనకే వేయాలి.
  •  సినిమాలో చాలా చోట్ల హాస్యం బాగా పండింది. సత్య, రావు రమేష్, నితిన్ ల చేసిన కామెడీ బాగానే నవ్వించింది. క్కబట్టి రెండు విజిల్ హాస్యానికే వేయాలి.
  •  ఇక త్రివిక్రమ్ ప్రాసలతో నడిచే డైలాగ్స్, కొన్ని పాటలు, సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. వీటన్నిటికీ కలిపి మూడు విజిల్ వేయొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

  • సినిమా ప్రేమ కథే కానీ హీరో హీరోయిన్ల మధ్యన రొమాన్స్ అనేదే కనిపించదు. దీంతో ప్రేమ కథ చూస్తున్నామనే ఫీలింగ్ పెద్దగా కలగదు.
  •  ప్రేమలో పడిన హీరో హీరోయిన్లు అసలెందుకు విడిపోయారు, వారి మధ్యన దూరం ఎందుకు పెరిగింది అనే పాయింట్స్ కూడ పెద్ద బలంగా ఉండవు.
  •  సరే విడిపోయిన వారు మళ్ళీ కలుకోవడానికైనా గట్టి రీజన్స్ ఉన్నాయా అంటే అదీ ఉండదు. సినిమా సెండాఫ్ అంతా ఇలానే కారణాలు లేకుండా జరిగిపోతూ ఉంటుంది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

ఈ సినిమాలో ఆశ్చర్యానికి గురికావాల్సిన అంశాలేవీ కనబడలేదు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఎ : ఇది లవ్ స్టొరీనేనా ?
మిస్టర్ బి : అవునట.. ఆ డౌట్ నీకెందుకొచ్చింది !
మిస్టర్ ఎ : పంచులు, ప్రాసలు తప్ప రొమాన్స్, ఎమోషన్ లాంటివి లేకపోతే అనుమానం వచ్చింది.