రాజా (X) శౌర్య‌ : అమెరికాలో మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌లో!?

Friday, February 2nd, 2018, 10:19:55 PM IST

ర‌వితేజ `ట‌చ్ చేసి చూడు`, నాగ‌శౌర్య `ఛ‌లో` చిత్రాలు నేడు అత్యంత భారీగా రిలీజైన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ స‌హా అమెరికాలోనూ ఈ చిత్రాలు భారీగా రిలీజ‌య్యాయి. ఒవ‌ర్సీస్‌లో ట‌చ్ చేసి చూడు చిత్రాన్ని బ్లూస్కై సినిమాస్‌, ఛ‌లో చిత్రాన్ని సారిగ‌మ సినిమాస్ రిలీజ్ చేశాయి. విదేశాల్లో మ‌న‌వాళ్ల‌ స్పీడెంత‌? అన్న‌దానికి తాజా గ‌ణాంకాలు ప‌రిశీలించాలి.

మాస్ రాజా ర‌వితేజ న‌టించిన‌ `ట‌చ్ చేసి చూడు` 90 స్క్రీన్ల‌లో రిలీజై 72కె డాల‌ర్లు వ‌సూలు చేయ‌గా, యువ‌హీరో నాగ‌శౌర్య న‌టించిన `ఛ‌లో` 92 స్క్రీన్ల‌లో రిలీజై 79కె డాల‌ర్లు వ‌సూలు చేసింది. డే-1 వ‌సూళ్లు క‌ల‌ప‌కుండానే ప్రీమియ‌ర్ల‌తో ఆర్జించిన మొత్త‌మిది. అంటే ఇప్ప‌టికే ఒక మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌ని అధిగ‌మించిన‌ట్టేన‌ని అర్థ‌మ‌వుతోంది. అంటే ఈ రెండు సినిమాలు ఇప్ప‌టికే 6 కోట్లు పైగా ఆర్జించాయ‌ని లెక్క తేలిన‌ట్టు. అంతేకాదు మాస్ మ‌హారాజ్‌తో పోటీప‌డుతూ యంగ్ హీరో నాగ‌శౌర్య అక్క‌డ మంచి వ‌సూళ్లే ద‌క్కించుకున్నాడు. ఇక ర‌వితేజ గ‌త చిత్రం `రాజా ది గ్రేట్‌` 90 స్క్రీన్ల‌లో రిలీజై ప్రీమియ‌ర్ల‌తోనే 117 కె డాల‌ర్లు వ‌సూలు చేసింది. దాంతో పోలిస్తే, ట‌చ్ చేసి చూడు వెన‌క‌బ‌డింద‌నే చెప్పాలి.