పూల వ్యాపారం పోయిందంటూ పుల్‌గా నవ్వించిన చమ్మక్ చంద్ర..!

Sunday, June 9th, 2019, 12:11:47 AM IST

బుల్లితెరపై ప్రస్తుతం నంబర్‌వన్ ప్రోగ్రాంగా పేరు సంపాదించుకున్నది జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్. అయితే ఈ కామెడీ ప్రోగ్రాం ద్వారా అందరిని కడుపుబ్బా నవ్విస్తుంటారు ఇందులోని కంటెస్టెంట్లు. అయితే అందరి స్కిట్‌లు ఒకలా ఉంటే చమ్మక్ చంద్ర స్కిట్‌లు మాత్రం కాస్త భిన్నంగా ఉంటాయి. చమ్మక్ చంద్ర ఎక్కువగా ఆడవారిపై, పెళ్ళాలపై సరదా జోక్‌లు వేస్తూ అందరిని నవ్విస్తుంటారు. అయితే చంద్ర ఏ స్కిట్ చేసినా అందులో బలయ్యేది మాత్రం సత్తిపండు మాత్రమే.

అయితే నిన్న జరిగిన ఎక్స్‌ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో చమ్మక్ చంద్ర చేసిన స్కిట్ అందరిని ఎంతగానో నవ్వించింది. తన యాక్టింగ్‌కు, డైలాగ్‌లకు సత్తిపండు అమాయకత్వం తోడయితే ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అయితే పూల వ్యాపారిగా ఉన్న చంద్ర తన షాప్ రోడ్ వైండింగ్‌లో పోవడంతో అది మరిచిపోలేని చంద్ర ఇంటికి ఎవరైనా పూలు పెట్టుకుని వస్తే ఆ పూలు వాడిపోకూడదని వాటిపై నీళ్ళు చల్లుతూ ఉంటాడు. ఇదేంటి అని అడిగితే పూలు వాడిపోవడం తనకు నచ్చదని, ఇలా పూలు వాడకుండా నీళ్ళు చల్లడం తనకు అలవాటు అని చెబుతాడు. అంతేకాదు ఒక పొలిటికల్ లీడర్‌గా ప్రచారానికి వచ్చిన సత్తిపండును మాత్రం ఓ రేంజ్‌లో ఇబ్బంది పెట్టాడు చంద్ర. సత్తి పండు మెడలో ఉన్న పూల దండలపై నీళ్ళు చల్లడమే కాకుండా, అతని ముఖంపై పై కూడా నీళ్ళు చల్లుతాడు. అయితే ఇతని బాధ తట్టుకోలేక సత్తిపండు చంద్రాకి చికెన్ షాప్ పెట్టిస్తాడు. అయితే నెల రోజుల తరువాత అది కూడా రోడ్ వైండింగ్‌లో పోయిందని ఇప్పుడు ఎవరిని చూసినా కత్తితో నరకాలని అనిపిస్తుందని చెప్పడంతో సత్తిపండు అక్కడి నుంచి పారిపోతాడు. అయితే చంద్రా చేసిన ఈ స్కిట్ అందరిని ఎంతగానో నవ్విస్తుంది. మీరు కూడా ఆలస్యం చేయకుండా ఈ క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేసి ఈ వీడియో చూసేయండి మరీ.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి