విశాఖలో ఐటీ సిఈఓల సదస్సు

Monday, September 29th, 2014, 03:48:13 PM IST

chandrababunaidu1
విశాఖ నగరాన్ని ఐటి హబ్ గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నో సార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. అందులోభాగంగా ఈ రోజు విశాఖలో ఐటి కంపెనీల సిఈఓల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. విప్రో, టెక్ మహీంద్రా మరియు సమీర్ వంటి ఐటి కంపెనీలతో రాష్ట్రప్రభుత్వం పలు ఒప్పందాలను కుదుర్చుకున్నది. మధురవాడ ఇంక్యుబేషన్ అభివృద్దితో పాటు, మధురవాడ ఐటి అభివృద్దికి ఐటి కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. అలాగే.. చిరువ్యాపారులకు, మహిళలుకు ఇంటర్నెట్ ద్వారా లబ్ది పొందేందుకు గూగుల్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని… ప్రతికూల పరిస్థితులలో కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకునే సత్తా ఉన్న నేత చంద్రబాబు నాయుడేనని.. ప్రభుత్వ ఐటి సలహాదారుడు సత్యన్నారాయణ తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్దవంతమైన నాయకుడని.. ఆయన అద్వర్యంలో రాష్ట్రం అభివృద్ది పధంలో ముందుకువెళ్తుందని వారు పేర్కొన్నారు.