చంద్రబాబు సరికొత్త ప్లాన్ – ఎవరిని టార్గెట్ చేశారు…

Friday, June 14th, 2019, 04:00:31 AM IST

ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో జరిగినటువంటి దారుణమైన ఓటమినుండి టీడీపీ పార్టీ ఇంకే తేరుకోకముందే ప్రస్తుత అధికార పార్టీ ఐన వైసీపీ ఇప్పటికి కూడా ద్వితీయశ్రేణి నేతలపై ప్రత్యక్ష మరియు పరోక్ష దాడులకు పాల్పడుతున్నారు. ప్రస్తుతానికి టీడీపీ అధినేత చంద్రబాబు కి పార్టీని బలపరచాలో లేక పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలో తెలియని పరిస్థితి ఉందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి… ప్రస్తుతానికి చంద్రబాబు తన కార్యకర్తలను రక్షించుకోకపొతే మాత్రం భవిష్యత్తులో క్యాడర్‌ను రక్షించుకోవడం కష్టమవు తుందనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ఏపీలో స్థానిక ఎన్నికలకు సమయం దగ్గరవడంతో ఎలాగైనా ఈ ఎన్నికల్లో టీడీపీ తన పూర్వ వైభవం తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. అందుకు సంబందించిన ప్రణాళికలను చంద్రబాబు సిద్ధం చేసుకున్నాడు కూడా… పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో ముందు లాంటి ఎనేర్జిని నింపేందుకు నేడు ఉదయం 10 గంటలకు విజయవాడ ఎ వన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఒక రోజు వర్క్‌షాప్‌ నిర్వహిం చనుంది.

ఈ సమావేశంలో చంద్రబాబు పార్టీని, పార్టీ శ్రేణుల గురించి ప్రసంగించనున్నారు. పార్టీ కార్యకర్తలపై జరిగే దాడుల్ని అడ్డుకోడానికి పెద్ద ఎత్తున చర్యలని చేపట్టనుంది. ఒకవేళ దాడుల్ని కాపాడుకోకపోతే పార్టీ బలం దెబ్బతింటుందని అధిష్ఠానం భావిస్తుంది. అంతేకాకుండా దాడులను ఎదుర్కొనేందుకు ఎలాంటి కార్యాచరణను అవలంభించాలనే వ్యూహంపై వర్క్‌షాప్‌లో నిర్దిష్టమైన ప్రమాణాలను చేయనున్నారని సమాచారం. కాగా ఎన్నికల్లో ఓటమిపై కూడా లోతుగా విశ్లేషణలు జరపనున్నారని తెలుస్తుంది. ఈమేరకు అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన సమస్యలను ప్రాధాన్యతల వారీగా సేకరించే అంశాన్ని పార్టీ సమావేశంలో చర్చించి, ఆదిశగా అడుగులు వేయనున్నారని సమాచారం.