మోడీ చంద్రబాబుల భేటీ సారాంశం!

Saturday, January 13th, 2018, 04:38:16 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దాదాపు ఒక సంవత్సరంన్నర తర్వాత ప్రధాని మోడీ అప్పాయింట్మెంట్ దొరకడంతో నిన్న ఢిల్లీ లో వీరిద్దరి మధ్యలో జరిగిన భేటీ ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన సమస్యలపై ఈ చర్చ జరిగి ఉందొచ్చని అంటున్నారు. అయితే భేటీ తర్వాత మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రధాని సహకారం అడిగినట్లు ముఖ్యంగా విభజన సమయంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా నెరవేర్చమని అడిగారట. అంతే కాక పోలవరానికి ఇప్ప్పటివరకు 12,000 వేల కోట్లు ఖర్చు చేశామని, రెవెన్యూ లోటు 3,979 కోట్లు ఇచ్చారని, ఇంకా ఇవ్వాలని ఆయన చెప్పారు.

13వ షెడ్యూల్ లోని విద్యాసంస్ధల నిర్మాణానికి 11,000 కోట్లకుగాను ఇప్పటివరకు కేవలం 460 కోట్లే ఇచ్చారని చెప్పారు. ప్రత్యేక హోదా బదులుగా ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ పై స్పష్టత ఇవ్వమని అడిగానని, అలాగే రాష్ట్రానికి రావలసిన రైల్వే జోన్ విషయం కూడా చర్చించినట్లు చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన అంశం వీలైనంత త్వరగా తేల్చాలని అడిగినట్లు ఆయన చెప్పారు. తనకి రాష్ట్ర అభివృద్ధి కంటే వేరేది ముఖ్యం కాదని, ప్రత్యేక హోదా విషయమై రాజీనామా చేస్తానన్న వారు ఇప్ప్పుడు అడ్రస్ లేకుండా పోయారని పరోక్షంగా వైసిపి పై విమర్శలు గుప్పించారు. అయితే రాష్ట్ర అభివృధి గురించి ఏ విషయం లోను రాజీ పడేదే లేదని, ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రతి పేదవాడికి అందేలా చూస్తామన్నారు.