చంద్రబాబు విదేశీ పర్యటన రద్దు – కారణం అదేనా…?

Thursday, June 6th, 2019, 01:34:17 AM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసుకున్నటువంటి విదేశీ పర్యటన ప్రస్తుతానికి వాయిదా పడింది. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి వేసుకున్న విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు తన కుటుంబసభ్యులతో విదేశాలకు వెళ్లాలని చంద్రబాబునాయుడు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. కానీ ఈనెల 12 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతో, తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఏప్రిల్ 12న కొత్త అసెంబ్లీ కొలువుదీరనుంది. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు అందరు కూడా అసెంబ్లీ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే చిన అప్పల నాయుడు వ్యవహరిస్తారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది. వైసీపీ నుంచి 151 మంది, టీడీపీ నుంచి 23 మంది, జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే విజయం సాధించారు. వీరిలో ఎవరెవరు ఏయే శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తారనేది కూడా అదే రోజు తెలపనున్నట్లు సమాచారం.