లక్ష కోట్లు అడుగుతున్న చంద్రబాబు

Friday, September 12th, 2014, 06:22:33 PM IST


ఆంధ్రప్రదేశ్ కు నూతన రాజధానిని నిర్మించుకునేందుకు 1,00, 213 కోట్లు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.కొత్త రాజధాని నిర్మాణం చేపట్టాల్సి ఉందని, అధికారుల పంపిణీ కూడా ఇంకా పూర్తి కాలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రం సమస్యలతో సతమతం అవుతోందని చంద్రబాబు చెప్పారు. తిరుపతిలో 14వ ఆర్థిక సంఘం సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.

సంక్షోభాన్ని అభివృద్ధికి అనుకూలంగా మార్చుకుంటాని చంద్రబాబు అన్నారు. 2029 నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంచుతామన్నారు. స్వర్ణాంధ్ర సాధనకు స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన వివరించారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా ఆర్థిక సంఘాన్ని కోరారు.