ఆ విషయలో బాబుగారి వైఖరి మారినట్టేనా.. ఓటమి నేర్పిన గుణపాటం..!

Sunday, August 11th, 2019, 08:25:48 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన రెండు నెలలలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే వైసీపీ చేతిలో ఘోరంగా ఓటమి పాలైన టీడీపీపై ఇప్పటికి విమర్శలు తగ్గడంలేదు. అయితే గతంలో చంద్రబాబు, జగన్ మధ్య ఉన్న తేడాను చూపడానికి వైసీపీ నేతలు వారు తాగే వాటర్ బాటిల్ తేడాను చూపి చంద్రబాబుపై తెగ విమర్శలు చేశారు.

అయితే గత ఐదేళ్ళుగా అధికారంలో ఉన్న చంద్రబాబుకు దాహం వేసినప్పుడు తాగే మంచి నీళ్ల బాటిల్ ఖరీదు అక్షరాల 200 రూపాయలట. ఇదంతా సొంత సొమ్ముతో కొంటున్నాడా అంటే అదీ లేదు. సమావేశాలు, సమీక్షలు పెట్టినప్పుడల్లా చంద్రబాబు ముందు హిమాలయ వాటర్ బాటిల్ కనిపించేది. అంతేకాదు చంద్రబాబు తనయుడు లోకేశ్ కూడా అదే ఖరీదైన వాటర్ తాగేవారట. అయితే సమావేశంలో ఉన్న మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రం సాదా సీదా వాటర్ బాటిల్ అందించేవారట. అయితే చంద్రబాబు సొంత డబ్బులతో కాకుండా కేవలం తాగేనీరుకే ఇంతలా ప్రజాధనాన్ని వృధా చేశాడని అప్పట్లో విమర్షలు బాగానే వినిపించాయి. అయితే వైసీపీ అధినేత సీఎం జగన్ మాత్రం తన ముందు 20 రూపాయల సాదాసీదా వాటర్ బాటిల్‌ను వాడాడని, మిగతా మంత్రుల ముందు ఏ వాటర్ బాటిల్ అయితే ఉంచారో జగన్ కూడా అదే వాటర్ బాటిల్‌ను వినియోగించారని ప్రజాధనాన్ని పొదుపుగా వాడేందుకు తన ప్రమాణ స్వీకారాన్ని కూడా తక్కువ ఖర్చుతోనే చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి జగనే అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.

అయితే సెగ తాకితేనే వేడి అనేది తెలుస్తుంది అన్నట్టుగా ఓటమి పాలవ్వగానే గుణపాటం తెలిసింది చంద్రబాబుగారికి. తాజాగా చంద్రబాబు సమక్షంలో టీడీపీ పోలిట్ బ్యూరో భేటీ జరిగింది. అయితే ఈ సమావేశంలో గతంలో జరిగిన తప్పులు జరగకూడదని, వైసీపీకి టీడీపీనీ విమర్శించే అవకాశం ఇక మీదట ఇవ్వకూడదని భావించిందేమో ఏమో కానీ ఈ భేటీలో హిమాలయ బాటిళ్ళు కాకుండా కిన్‌లే వాటర్ బాటిళ్ళను వాడింది. అంతేకాదు ఇవి ఫోటోలకు బాగా కనిపించేలా అన్ని ఒకే దగ్గర పెట్టి మరీ ఉండడం విశేషం. ఏది ఏమైనా టీడీపీకి ఓటమితో చేసిన అసలు తప్పులు తెలిసొచ్చాయని వైసీపీ నేతలు ఈ విషయంపై చర్చించుకుంటున్నారు.