చంద్రబాబు బయోపిక్ .. మరి ఇంత కామెడినా ?

Tuesday, October 2nd, 2018, 10:18:01 AM IST

ప్రస్తుతం తెలుగులో బయోపిక్ చిత్రాల హవా బాగా పుంజుకోవడంతో పలువురు దర్శక నిర్మాతలు ఆ తరహా సినిమాలు తీయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొన్ని బయోపిక్ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి .. అందులో అన్న నందమూరి తారక రామారావు బయోపిక్ ఎన్టీఆర్ , వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర, పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి సైరా .. ఇప్పుడు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జీవిత కథతో బయోపిక్ మొదలు పెట్టారు కొందరు తెలుగు తమ్ముళ్లు. బయోపిక్ అంటే ప్రేక్షకులకు ఆదర్శంగా ఉండేలా తెరకెక్కించాలి .. అయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను అద్భుతంగా చూపించాలి .. కానీ చంద్రబాబు బయోపిక్ చంద్రోదయం విషయంలో మాత్రం మేకర్స్ చాలా కామెడీ చేస్తున్నారు. అసలు చంద్రబాబు పాత్రలో నటిస్తున్న వ్యక్తి మేకప్ చూసి ఇటీవలే కొందరు నెటిజన్స్ ఘాటు కామెంట్స్ చేశారు. ఎంత తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు మీద ప్రేమో .. లేక చంద్రబాబు ని ఇంప్రెస్ చేయాలనీ తీస్తున్నారో తెలియదు గాని .. ఈ సినిమాను మాత్రం కామెడీ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా కొన్ని ఫొటోస్ విడుదల అవ్వడంతో ఈ సినిమా ఇంకా నవ్వులపాలు అయ్యేలా ఉంది. తాజాగా చంద్రబాబు, ఎన్టీఆర్ ఉన్న ఫోటో ఒకటి విడుదల చేసారు .. ఈ ఫోటో చూస్తుంటే అదేదో డ్రామా కంపెనీ లో స్కిట్ కోసమో .. లేక జబర్దస్త్ షో కోసమే వేసినట్టు ఉంది. మరి ఈ విషయంలో మేకర్స్ సీరియస్ గా వర్కవుట్ చేస్తే తప్ప .. ఆ కామెడీ చిత్రాన్ని సీరియస్ గా మార్చలేరు.