కార్యకర్తలపై దాడులు అమానవీయం – ఖండించిన చంద్రబాబు

Tuesday, June 11th, 2019, 01:50:42 AM IST

ఏపీలో ఎన్నికలు పూర్తయ్యి చాలారోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా టీడీపీ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి… కాగా ఈ దాడులపట్ల టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కార్యకర్తలపై జరిగిన దాడులను ఆయన ఖండించారు. కాగా తన పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించిన చంద్రబాబు ప్రస్తుతానికి రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు పరిస్థితిని నాయకులకు వివరంగా వివరించారు చంద్రబాబు… అంతేకాకుండాఈ నెల 15న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు కార్యకర్తలకు, నేతలకు పార్టీ ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటుందని, ఎలాంటి సమస్యలు రానీకుండా చూసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు… కాగా ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి దాడులను ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని ఇతర నేతలకు సూచించారు. అంతేగాకుండా, పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రస్తుత ప్రభుత్వానికి అన్ని రకాలుగా నిర్మాణాత్మక సహకారం అందిస్తామని చంద్రబాబు అన్నారు… కాగా ఎన్నికల్లో ప్రజా తీర్పుని గౌరవిస్తామని, తీర్పు ఏదైనా కూడా ప్రజల కోసం పోరాటం సాగుతామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలియజేశారు…