ప్రతిపక్ష నేతకు రాఖీ కట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Wednesday, August 14th, 2019, 01:08:04 PM IST

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, తెలుగు దేశం పార్టీ మాజీ నేత, సీతక్క నేడు హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు ని కలుసుకొని రాఖీ కట్టారు. సీతక్కతో పాటే ఏపీ మాజీమంత్రి పరిటాల సునీత కూడా చంద్రబాబుకు రాఖీ కట్టారు. కాగా ఈమేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయకోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కతో చాలా జరిపినట్లు సమాచారం. అంతేకాకుండా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై కూడా చంద్రబాబు ఆరాతీశారని సమాచారం. కాగా రాజకీయాల్లో నేతలు మారడం సర్వ సాధారణమని, కానీ పార్టీలు మారినప్పటికీ కూడా మానవ సంబంధాలు ముఖ్యమని చంద్రబాబు గారు వాఖ్యానించారు.

కాగా గత కొన్ని ఏళ్లుగా తన పార్టీలో ఉన్నప్పటికీ కూడా, ఆతరువాత పార్టీ మారినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కను టీడీపీ అధినేత చంద్రబాబు గారు అభినందించారు. కాగా కొన్ని ఆరోగ్య సమస్య నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు గారు తన ప్రత్యేక వైద్యుల సలహా మేరకు హైదరాబాద్ కి వచ్చారని తెలుసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, చంద్రబాబుతో కాసేపు తన ఆరోగ్య సమస్యలకోసం కూడా చర్చించారు.