అందరికి అండగా నేనుంటా – చంద్రబాబు భరోసా

Friday, August 23rd, 2019, 10:30:50 PM IST

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా కొందరు వైసీపీ నేతలు కావాలనే టీడీపీ నేతలు మరియు కార్యకర్తలపై చాలా దారుణాలకు రోజులుగా టీడీపీ నేతలందరూ కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు… ఈ దాడుల కారణంగా చాలా మంది టీడీపీ కార్యకర్తలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే… అయితే తన టీడీపీ నేతలందరికీ మరియు, టీడీపీ కార్యకర్తలందరికీ అండగా ఉంటానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇకమీదట ఇలాంటి దాడులేవీ జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా నేడు గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి నాయకులూ మరియు కార్యకర్తలందరు కూడా వైసీపీ నేతలందరూ జరుపుతున్న దాడులపై చర్చించేందుకు చంద్రబాబుని కలిశారు.

ఈమేరకు టీడీపీ పార్టీకి సంబందించిన అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్నీ పోస్టు చేశారు. కాగా “గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయానికి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు చేస్తున్న దాడుల గురించి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసారు. కార్యకర్తలకు అండగా ఉండటానికి తానే రంగంలో దిగుతానని చంద్రబాబు వారికి భరోసా కల్పించారు”.