ఉద్యోగులు చనిపోవడం బాధాకరం – చంద్రబాబు

Monday, April 19th, 2021, 03:42:16 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటానికి కారణం జగన్ అలసత్వం అంటూ తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి పట్ల సీఎం జగన్ మోహన్ రెడ్డి అలసత్వం ప్రదర్శించడం వల్లే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కోవిడ్ విలయ తాండవం చేస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు కోవిడ్ భారిన పడకుండా ఇంటి నుండే పని చేసే వెసులు బాటు కల్పించాలి అని సీఎం జగన్ మోహన్ రెడ్డి కి సూచించారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రణాళిక లోపం, అవగాహన రాహిత్యం తోనే ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అయితే తాడేపల్లి ప్యాలెస్ నుండి సీఎం వైఎస్ జగన్ బయటకు రాకపోగా, ఉద్యోగుల రక్షణకు ఎలాంటి శ్రద్ద పెట్టకుండా తప్పనిసరిగా విధులకు హాజరు కావాలి అంటూ బెదిరించడం దుర్మార్గం అంటూ చెప్పుకొచ్చారు. అయితే వారం రోజుల వ్యవధిలో పలువురు ఉద్యోగులు చనిపోవడం బాధాకరం అంటూ అంటూ చంద్రబాబు నాయుడు అవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఆదాయం కోసం మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులకి డ్యూటీలు వేసి మరీ వేదించారు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్యం పై కూడా శ్రద్ద తీసుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం కి సూచించారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల కి వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.