షాకింగ్ : జగన్ విషయంలో చంద్రబాబు వివాదం రేపే కామెంట్స్.!

Wednesday, September 18th, 2019, 11:35:55 AM IST

ఇప్పుడు ఒక పక్క కోడెల మరణ వార్త విషయంపై ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేగుతుంటే మరో పక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జగన్ ప్రభుత్వ వైఖరి విషయంలో తీవ్ర స్థాయి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కోడెల ఘటన జరగక ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని వైసీపీ పై నిరసన వ్యక్తం చేసేందుకు భారీ ప్లాన్ వేసి ఛలో ఆత్మకూరు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ నేతలు అందరికి పిలుపు ఇవ్వడంతో ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం హీటెకెక్కింది.

తెలుగు తమ్ముళ్లను ఎక్కడ పడితే అక్కడ ఆపేసి పోలీసులు అరెస్టులు చేసారు.అంతే కాకుండా చంద్రబాబు ఇంటి నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ కూడా చేసారు.ఇప్పుడు ఈ అన్ని ఘటనలపై తాను ఎంత దూరం అయినా సరే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు జగన్ పై కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేసారు.తన ఇంటి దగ్గర తాళ్లు కట్టి నన్ను బయటకు పోనివ్వకుండా హౌస్ అరెస్ట్ చేస్తారా?ఈ విషయంపై ప్రశ్నించేందుకు వచ్చిన తన ఎమ్మెల్యేపై కేసులు పెడతారా అంటూ పోలీసు వ్యవస్థపై రెచ్చిపోయారు.

తమ పార్టీ నేతలపై పెట్టిన ప్రతీ కేసు మీద కూడా డిబేట్ కు వెళ్తానని ఆ ఊరు వెళ్లి నిలదీస్తానని ఆ ఎస్సై,సీఐ లు సమాధానాలు చెప్పాలని మండిపడ్డారు.చెప్పకపోతే ఏ పోరాటానికి అయినా సరే తాను సిద్ధమే అని తెలిపారు.జగన్ ఒక సైకో ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని వీరు చేసే వేధింపుల మూలాన కోడెల ఆత్మ హత్య చేసికున్నట్టు అంతా చేసుకోవాలని భావిస్తున్నారా అంటూ జగన్ పై వివాదం రేపే కామెంట్స్ చేసారు.