చంద్రబాబు పరువు తీసిన సుజనాచౌదరి

Thursday, September 12th, 2019, 01:13:56 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకు కూడా చాలా మార్పులు వస్తున్నాయి… గతంలో చంద్రబాబు తో చాలా సన్నిహితంగా మెలిగినటువంటి సుజనా చౌదరి ఇపుడు ఏకంగా చంద్రబాబు పైన చాలా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అయితే గతంలో చాలా స్నేహపూర్వకంగా మెలిగినటువంటి సుజనా ఒక్కసారిగా ఇలా చంద్రబాబు పై ఇలా తీవ్రమైన విమర్శలు చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు చంద్రబాబు… కాగా సుజనా చౌదరి రాజకీయాల్లోకి రాడానికి కారణం చంద్రబాబు అని చాలా సార్లు అధికారికంగా వెల్లడించారు. కానీ ఇలాంటి మార్పు వెనకాల ఎలాంటి శక్తులు ఉన్నాయో అని అందరు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు తనకి దేవుడు లాంటి వాడు అని చెప్పిన సుజనా చౌదరి మాత్రం ఇపుడు తనకు అంత సీన్ లేదు అని పలు సంచలనమైన విమర్శలు చేస్తున్నారు సుజనా…

అడ్కరాన్ని కోల్పోయినంత మాత్రాన తనని ఇలా అనడం ఎంతవరకు కరెక్టు కాదని పలువురు సుజనా చౌదరి పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.కాగా విజయవాడలో నేడు సుజనా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా “మూడేళ్లలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశముందంటూ చంద్రబాబు నాయుడు ఎలా చెప్తారంటూ సుజనా చౌదరి ప్రశ్నించారు. అంతవరకూ అంటే బాగానే ఉండేది.. కానీ.. జమిలి ఎన్నికలపై మాట్లాడే స్థాయిలో చంద్రబాబు లేదంటూ” సుజనా విమర్శించారు. కానీ సుజనా మాట్లాడింది చాలా తప్పని, కృతజ్ఞత భావం ఉండాలని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.