వైసీపీ బాధితుల పట్ల చంద్రబాబు డిమాండ్స్ ఇవే…

Wednesday, September 11th, 2019, 12:29:16 AM IST

ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల తరువాత, ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని దక్కించుకున్నటువంటి వైసీపీ పార్టీ నేతలు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ టీడీపీ కార్యకర్తలపై అనవసరమైన దాడులకు పాల్పడుతున్నారని గత కొద్దీ రోజులనుండి కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వారికోసమనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక కొత్త సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనున్నాడు. కాగా ఆ సమావేశంలో వైసీపీ నేతల బాధితులకు అండగా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని రకాల డిమాండ్లను చేశారు… అవేంటంటే…?

1.వైసీపీ కార్యకర్తల దాడుల్లో ధ్వంసమైన ఆస్తులకు నష్టపరిహారం చెల్లించాలి
2.ఎక్కడ స్వల్ప ఘర్షణ జరిగినా వెంటనే స్పందించాలి
3.పంట కోల్పోయిన బాధిత రైతులకు కౌలు చెల్లించాలి
4.బాధితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి.. భవిష్యత్ లో ఎలాంటి కేసులు పెట్టకూడదు
5.టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు ఎత్తివేయాలి
6.అక్రమంగా పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులు ఉపసంహరించుకోవాలి
7.బాధిత గ్రామాల్లో పోలీస్ పహారా పెంచాలి
8.సీసీ కెమెరాలు, పెట్రోలింగ్ బృందాలతో భద్రత కల్పించాలి
9.నిందితులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలి
10.ఎక్కడ స్వల్ప ఘర్షణ జరిగినా వెంటనే స్పందించాలి
11.ఎఫ్ఐఆర్ నమోదు చేయని చోట వెంటనే నమోదు చేయాలి
12.బాధితుల ఫిర్యాదులు స్వీకరించని పోలీసులపై చర్యలు చేపట్టాలి