నాకు అవమానం జరిగిన పర్వాలేదు ..అసెంబ్లీ లో చంద్రబాబు ఆవేదన

Thursday, June 13th, 2019, 06:00:42 PM IST

ప్రస్తుతం ఆంధ్రలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను గమనిస్తే ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొనివుంది. స్పీకర్ ని గౌరవంగా కుర్చీలో కూర్చోబెట్టటానికి చంద్రబాబు రాలేదంటూ మొదలైన చర్చ పెను దుమారాన్నే లేపింది. దీనిపై ఇరు వర్గాలు పెద్ద ఎత్తున మాటల దాడులు చేసుకుంటున్నాయి. చంద్రబాబుకి సభా మర్యాదలు అంటే గౌరవం లేదని, ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన మిమ్మల్ని స్పీకర్ గా నియమించిన కానీ, అభినందించే పని చేయటానికి చంద్రబాబుకి మనస్సు రాలేదంటూ వైసీపీ సభ్యులు ఘాటుగానే విమర్శించారు.

ఇక దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ, ప్రొటెం స్పీకర్ అధికార పక్షానికి చెపుతూ స్పీకర్ ని కుర్చీ దగ్గరకి తీసుకోని వెళ్లాలని కోరాడు, తప్పితే ప్రతిపక్షము అని పిలవలేదు. ఇలా పిలవని పేరంటానికి రావటం మంచి పద్ధతేనా మీరే చెప్పండి..మీ ఎన్నికకు ముందు కనీసం నాకైనా, మా సభ్యులకైనా సరే జగన్ కానీ, వాళ్ళ ప్రభుత్వం తరుపున కానీ ఎవరు ఫోన్ కూడా చేయలేదు. అయినా సరే నాకు అవమానం జరిగిన పర్వాలేదు. మీరు వెళ్ళిరండి అంటూ అచ్చెన్ననాయుడుని పంపించటం జరిగింది. నలభైయేళ్ల రాజకీయ అనుభవం,పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి అనుభవం, పదేళ్ల ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా లో పనిచేసిన నాకే ఇలా జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో మీరే అర్ధం చేసుకోండని చంద్రబాబు నాయుడు ఆవేదనతో మాట్లాడటం జరిగింది..