సీఎం కి ఒక్క నిమిషం కూడా పదవిలో ఉండే అర్హత లేదు – చంద్రబాబు

Friday, April 16th, 2021, 07:35:09 AM IST


తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నేపథ్యం లో తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనా విధానం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి మీడియా సమావేశం ద్వారా చంద్రబాబు అధికార పార్టీ తీరు పై, జగన్ పట్ల ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచారం లో భాగంగా విస్తృతంగా తిరిగా అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో అవేదన ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. అంతేకాక అప్పులు చేయడం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ వన్ గా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, ఇతర నిత్యావసరాల ధరలు పెంచేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నిటి పై ప్రజల్లో చర్చ జరుగుతుంది అని, దేవాలయాల్లో దాడులు జరిగినా సీఎం జగన్ పట్టించుకోలేదు అని సంచలన ఆరోపణలు చేశారు.

అయితే తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. అక్రమ కేసుకు పెట్టీ వేధించడం కారణంగా కర్నూలు జిల్లాలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మ హత్య కు పాల్పడింది అంటూ చెప్పుకొచ్చారు. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక చాలామంది వలసపోయారు అని అన్నారు. అయితే రాష్ట్రంలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నా సీఎం జగన్ స్పందించడం లేదు అని, డీ ఎన్ డీ బోర్డ్ పెట్టారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వలేని సీఎం కి ఒక్క నిమిషం కూడా పదవి లో ఉండే అర్హత లేదు అంటూ చెప్పుకొచ్చారు.