జగన్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగిన చంద్రబాబు

Wednesday, December 11th, 2019, 07:33:59 AM IST

అసీంబ్లీ సమావేశాలు చాల వాడివేడిగా జరుగుతున్నాయి. అయితే జగన్ ప్రభుత్వం ఫై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలపై నిలదీస్తే వ్యక్తిగత, అసత్య ఆరోపణలు చేసి తప్పించుకోవడం ప్రభుత్వానికి అలవాటైందని చంద్రబాబు ఆరోపించారు. ప్రజల ప్రాణాలు తీస్తున్న ఉల్లి గురించి అడిగితె హెరిటేజ్ ఫ్రెష్ గురించి మాట్లాడారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. హెరిటేజ్ ఫ్రెష్ ని ఫ్యూచర్ గ్రూప్ కి అమ్మేశామని, అందుచేతనే మీ ఆరోపణల్ని ఖండించానని చంద్రబాబు అన్నారు.

అయితే చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు వైసీపీ నేతలు జవాబివ్వలేకపోయారు. అయినా మొండిగా ఆ విషయాన్నీ పట్టుకొని ప్రజా సమస్యను వదిలేశారని విరుచుకుపడ్డారు. దేన్నైనా సహిస్తాను కానీ ప్రజల జోలికి వస్తే సహించను అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. నిరాధార ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రికి చంద్రబాబు సవాల్ విసిరారు. సభా సమయాన్ని వృధా చేసినందుకు గానూ, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు చంద్రబాబు. అయితే చంద్రబాబు హెరిటేజ్ ని ఫ్యూచర్ గ్రూప్ కి అమ్మేసిన వార్తని సాక్షిలో కూడా తెలిపారు. అదే విషయాన్నీ టీడీపీ అభిమానులు తెలియజేసారు.