బిగ్ బ్రేకింగ్: చంద్రబాబు హౌస్ అరెస్ట్… ఇంట్లో నిరాహార దీక్ష చేపట్టిన బాబు..

Wednesday, September 11th, 2019, 09:10:36 AM IST

చలో ఆత్మకూరు ప్రకటించిన చంద్రబాబు కు భారీ షాక్ తగిలింది. ఒక పక్క వైసీపీ కూడా చలో ఆత్మకూరు ప్రకటించింది. గుంటూరు లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అని చెప్పవచ్చు. పోలీసులు చంద్రబాబు ని గృహ నిర్బంధం చేసారు. చలో ఆత్మకూరు వెళ్లకుండా ఆయనని నివాసం వద్దనే అడ్డుకున్నారు. దీనికి నిరసనగా, ఇంట్లోనే నిరాహార దీక్షా చేపట్టారు చంద్రబాబు. పలు చోట్ల టీడీపీ నేతల అరెస్ట్ లు మొదలయ్యాయి. టీడీపీ నేతల ఇళ్ల చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు.

మాజీ మంత్రి పతి పాటి పుల్లారావు, గద్దె రామ్మోహన్ రావు, దేవి నేని ఉమామహేశ్వర్ రావు, శిద్ద రాఘవరావు, అశోక్ రెడ్డి లను హౌస్ అరెస్ట్ చేసారు పోలీసులు. అయితే చలో ఆత్మకూరు కి వెళ్లేటువంటి కార్యకర్త్తలను పోలీస్ స్టేషన్ లకి తరలించారు. పల్నాడులో కుటుంబ తగాదాల విషయాన్ని రాజకీయం గా స్వలాభం కోరకు చేసే ఈ చర్యలను పోలీస్ యంత్రంగం గట్టిగానే తిప్పికోట్టింది. అయితే పల్నాడు లో పోలీసులు 144 సెక్షన్ పెట్టడం తో గుంపులు గుంపులు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.