మెల్లగా ఖాళీ అవుతున్న టీడీపీ – వలసలు ఆగట్లేదుగా…?

Thursday, October 17th, 2019, 02:30:27 AM IST

ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల తరువాత టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా తయారయిందని చెప్పాలి. దాదాపుగా ఏపీలో టీడీపీ పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయిందని చెప్పాలి. అయితే ఇక అప్పటినుండి టీడీపీ పై విమర్శలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈమేరకు టీడీపీ మీద నమ్మకం లేని నేతలందరూ కూడా టీడీపీ కి గుడ్ బై చెప్పి, ఇతర పార్టీలో చేరిపోతున్నారు. అయితే ఈ వలసలు అనేవి ముందుగా టీడీపీ నుండి బీజేపీ చాలా పెద్ద మొత్తంలోజరిగాయి. కానీ ఇప్పుడు మాత్రం ఏపీ అధికార వైసీపీ పార్టీ బాట పడుతున్నారు మన టీడీపీ నేతలు.

కాగా ఇప్పటికి కూడా బీజేపీ లో ఉన్నటువంటి కీలకమైన నేతలు ఒకప్పటి టీడీపీ నేతలే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ఇప్పటికి కూడా టీడీపీ నుండి భారీ వలసలు ఉన్నాయని ప్రచారం జోరుగా జరుగుతుంది. అందులో ముఖ్యంగా చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి కూడా టీడీపీ ని వదిలి వైసీపీ లో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇకపోతే మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా కూడా టీడీపీ ని వదిలే యోచన లో ఉందని సమాచారం. కాగా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోత్యుల నెహ్రూ. పాడేరు మాజీ ఎమ్మెల్యే గిద్ది ఈశ్వరిలు కూడా టీడీపీ ని వడ్లనున్నారని సమాచారం. వీరితో పాటే టీడీపీ నేత రామసుబ్బారెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె తనయ శింగనమల మాజీ ఎమ్మెల్యే యామిని బాల కూడా ఉన్నారు. కాగా వీరందరూ కూడా వైసీపీ లో చేరతారని ప్రచారం జరుగుతుంది.