వైసీపీ లో చేరనున్న మరొక టీడీపీ నేత – షాక్ లో చంద్రబాబు

Wednesday, November 13th, 2019, 09:00:53 PM IST

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల తరువాత ప్రతిపక్ష పార్టీ టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా తయారయిందని చెప్పాలి. కాగా అప్పటి వరకు కూడా పార్టీలో నమ్మకంగా ఉన్నటువంటి నేతలు అందరు కూడా వరుసగా పార్టీ కి గుడ్ బై చెప్పి వెళ్లిపోతున్నారు. అయితే ఆ వలసలు ఇప్పటికి కూడా ఆగడం లేదని చెప్పాలి. దానికి తోడు ఏపీలో బలపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి బీజేపీ పార్టీ టీడీపీ లో అసమ్మతిగా ఉన్న నేతలందరినీ కూడా ఆకర్షించే పనిలో ఉందని చెప్పాలి. అయితే ఇప్పటివరకైతే దాదాపుగా టీడీపీ ని వదిలిన నేతలందరూ కూడా బీజేపీలోనే చేరిపోయారు. కానీ కొందరు మాత్రం అధికార వైసీపీ వైపు చూస్తున్నారు.

కాగా తాజాగా మరొక నేత టీడీపీ ని వదలడానికి సిద్దమయ్యాడు. కాగా విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ టీడీపీకి రాజీనామా చేసి వేరే పార్టీ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని సమాచారం. అయితే దేవినేని అవినాష్ కూడా వైసీపీ లో చేరతాడనే ప్రచారం జరుగుతుంది. అయితే గత కొంత కాలంగా టీడీపీ లో అసమ్మతిగా ఉంటున్న అవినాష్ తన సన్నిహితుల దగ్గర తాను ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం టీడీపీ నేతలే అని చెప్పుకున్నారంట. ఇకపోతే పార్టీ లో కూడా తనకి సరైన ఆదరణ లేదని అందుకనే పార్టీ వీడడానికి నిర్ణయించుకున్నాడని సమాచారం. ఇకపోతే దేవినేని అవినాష్ వైసీపీ లో చేరడానికి సీఎం జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.