తెలుగుదేశం పతనం బాబుకి అర్ధమయ్యిందా అందుకే ఇలా.?

Thursday, July 11th, 2019, 11:42:53 AM IST

2019 ఎన్నికల్లో కలలో కూడా ఊహించని అపజయాన్ని ఈ నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ చూసింది.వైసీపీ దెబ్బకు కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యాక ఇక తెలుగుదేశం పార్టీ పనయ్యిపోయిందన్న ఒక భావన తెలుగు రాష్ట్ర ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.ఓట్లు వచ్చినా సరే ఆ పార్టీకు సంబంధించి చాలా నేతలే ఇతర పార్టీలలోకి వరుస క్యూలు కడుతున్నారు.దీనితో ఆ పార్టీ బలం రోజురోజుకు మరింత దిగజారిపోతోంది.ఇదే నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలయ్యిపోయాయి.

అందులో భాగంగా ఈ రోజు బడ్జెట్ సమావేశాలు కూడా మొదలయ్యాయి.ఈ సమావేశాల్లో చంద్రబాబును గమనించినట్లతే ఆయనలో ఉన్న బెఱుకు సుస్పష్టంగా కనిపిస్తుంది.ఇక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి అన్నది ఆయన మాటల్లోని తడబాటు,ఆవేదనే చెప్పేస్తున్నాయి.దానికి తోడు మొత్తం 150 మంది ఎమ్మెల్యేలు సహా ముఖ్యమంత్రి జగన్ కూడా చంద్రబాబు మాట్లాడుతుంటే హేళన చేసేట్టుగా నవ్వడం వంటివి చేస్తుండడంతో చంద్రబాబు మరింత అసహనానికి గురయ్యారు.దీనితో ఇక తెలుగుదేశం పార్టీ పనయ్యిపోయిందని చంద్రబాబుకు అర్ధం అయ్యినట్టే అని చెప్పాలి.