బ్రేకింగ్: జగన్, డీజీపీ కి దిమ్మతిరిగి పోవడం ఖాయం!

Monday, October 21st, 2019, 03:15:26 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై మరియు డీజీపీ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు హయం లో చేసిన కార్యక్రమాల్ని మరియు ఇసుక కొరత పై పలు విషయాల్ని ప్రస్తావించారు చంద్రబాబు. ఉచితంగా ఇసుకని ఇస్తుంటే వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేసింది, మా పైనే విమర్శలు సరే, ప్రజలకి మీరేం చేసారు అని చంద్రబాబు ఆగ్రహం వీరక్తం చేసారు. ఈ రాష్ట్రం లో బంగారం అయిన దొరుకుతుంది కానీ ఇసుక మాత్రం దొరకడం లేదని అన్నారు. ఇసుక కొరత వల్ల దాదాపు 32 లక్షల మంది పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఇసుక కొరత మరియు దాని వలన జరిగే ఆర్థిక పరిణామాల్ని వివరించారు చంద్రబాబు నాయుడు. మా హయం లో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, రేట్లు పెరిగాయని విమర్శలు చేసారు. గొడవలెందుకు అని సైలెంట్ గా వున్నా అని చంద్రబాబు అన్నారు. దేశం లోనే ఇసుక ని ఉచితం గా ఇచ్చిన ప్రభుత్వం టీడీపీ అని అన్నారు.

మీడియా ముందు చంద్రబాబు షో చేస్తున్నారని డీజీపీ చేసిన వ్యాఖ్యల పై తీవ్రంగా మండిపడ్డారు చంద్రబాబు నాయుడు. ప్రజల ప్రాణాలు పోతుంటే మీకు ఇది షో లా కనిపిస్తుందా అని అన్నారు. బెదిరింపు చర్యలకు టీడీపీ కార్యకర్తలు భయపడరని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ ఆరోపణల పైనా వైసీపీ నేతలు ఇలా రియాక్ట్ అవుతారో మరి.