పృథ్విరాజ్ ఫై దిశ చట్టం కింద కేసు పెట్టాలి–చంద్రబాబు!

Monday, January 13th, 2020, 09:42:54 PM IST

ఓ మహిళతో రాసలీలలు నడిపాడన్న ఆరోపణలతో నటుడు పృథ్వి ఫై ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆ వాయిస్ తనది కాదని పృథ్వి మీడియా తో వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఆరోపణలు రావడం పట్ల అధిష్టానం నిర్ణయం మేరకు పృథ్విరాజ్ ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. అయితే ఈ విషయం ఫై చంద్రబాబు నాయుడు స్పందించారు.

మహిళల ఫై ఇలాంటి చర్యలకి పాల్పడినందుకు గాను దిశ చట్టం కింద పృథ్విరాజ్ ఫై కేసు పెట్టాలని చంద్రబాబు అన్నారు. అయితే ఇటీవల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ఫై గాను ఘాటుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ నేత చేసిన అసభ్య వ్యాఖ్యల పైన ప్రభుత్వం స్పందించలేదని గుర్తు చేసారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై, వైసీపీ ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల ఫై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.