కొత్త ప్రభుత్వంపై చంద్రబాబు ఊహించని వ్యాఖ్యలు!

Tuesday, August 13th, 2019, 12:48:38 PM IST

మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నేత యైనటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు వైసీపీను పెద్ద ఎత్తున టార్గెట్ చేసేందుకు సిద్ధమయ్యారు.వీరి పార్టీ ఇంత ఘోరమైన ఓటమి చవి చూసేసరికి ఇతర నేతలు అంతా భయపడినా సరే చంద్రబాబు బాబు మాత్రం అంతా తానొక్కడై మళ్ళీ పార్టీను పూర్వ స్థితికి తీసుకువచ్చేందుకు మాత్రం గట్టిగానే కష్టపడుతున్నారు.ఇందులో భాగంగా తమ పార్టీ శ్రేణుల్లో భవిష్యత్తు కార్యాచరణ కోసం దిశా నిర్దేశం చేసేందుకు ఈ రోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మీటింగులో వైసీపీ చేస్తున్న అక్రమాలు అరాచకాలపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

వైసీపీ వాళ్ళను ఎక్కడికక్కడ కట్టడి చేసుకోవాల్సిన బాధ్యత వారికుందని ఇష్టానుసారం చేస్తే మాత్రం మీ ఆటలు సాగనివ్వనని గట్టి వార్నింగ్ ఇచ్చారు.టీడీపీ అభిమానులపై వైసీపీ వారు దాడులు చేసి క్షమాపణ చెప్పిన తర్వాతే వారిని ఆసుపత్రికి పంపుతున్నారని,కొత్త ప్రభుత్వం వచ్చాకా ఇప్పటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయని నెల్లూరులో అయితే టీడీపీ నేతల ఇళ్లను కూల్చేస్తున్నారని మండిపడ్డారు.శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే మేమేం చెయ్యలేం మీరే చూసుకోండి అంటూ చేతులెత్తేస్తున్నారని వైసీపీ వారికి ఎందుకింత గర్వం ఇది మంచి పద్ధతి కాదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.