చంద్రబాబు కి మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్ట్!

Tuesday, November 19th, 2019, 03:17:58 PM IST

ఇప్పటివరకు చంద్రబాబు పై ఎన్ని కేసులున్నా శిక్ష పడలేదు. ఓటుకి నోటు కేసులో ఆడియో రికార్డు బయటికి వచ్చినప్పటికీ, రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయినప్పటికీ శిక్ష చంద్రబాబుకి పడలేదు. అయితే తెలంగాణాలో టీడీపీ పుంజుకునే పరిస్థితి లేకపోవడంతోనో మరేమిటో గాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసుని పట్టించుకోలేదు. అయితే 2005 లో చంద్రబాబు పై ఆస్తుల కేసు ఒకటి నమోదవ్వడమే కాకా, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి చంద్రబాబు పై ఫిర్యాదు చేయడం జరిగింది.

అయితే గతంలో చంద్రబాబు రాజకీయాలలో చాల హవా వుంది. ఇపుడు ప్రతి పక్ష పార్టీ లో ఉండటమే కాకుండా మెల్లమెల్లగా టీడీపీ ఫై ప్రజలకు నమ్మకం పోతుందని పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆదాయానికి మించి ఆస్తులున్నాయి అంటూ లక్ష్మి పార్వతి వేసిన కేసు ఇపుడు మళ్ళీ ఓపెన్ కానుంది. చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు అప్పట్లో. అయితే తాజాగా సుప్రీం కోర్ట్ ఆరు నెలల కంటే ఎక్కువగా క్రిమినల్ కేసుల్లో స్టే ఉంటే అది తొలగిపోయినట్లే అని తెలిపింది. అయితే స్టే తొలగిపోవడం తో చంద్రబాబు పై మళ్ళీ ఆ కేసు తోడే అవకాశం వుంది. అయితే ఈ విషయం లో చంద్రబాబు మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.