గవర్నర్‌ని కలిసిన చంద్రబాబు.. అసలు కారణం ఇదేనా..!

Friday, June 7th, 2019, 07:08:01 PM IST

ఏపీలో ఒక పక్క వైసీపీ మంత్రివర్గ కేబినెట్‌ను ప్రకటించే బిజీలో ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం గవర్నర్ కలిసే బిజీలో ఉన్నారు. నేడు ఉదయం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ని కలిసిన చంద్రబాబు రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలపై చర్చించారట. అయితే అనుకోకుండా చంద్రబాబు గవర్నర్‌ని ఎందుకు కలిసినట్టు అనే దానిపై ఇప్పుడు పలు సందేహాలు వినబడుతున్నాయి.

అయితే మొన్నటి వరకు చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తున్నాడని వార్తలు వినబడినా అది కూడా విరమించుకున్నట్టు తెలిపారు. అయితే విదేశీ పర్యటనను రద్దు చేసుకుని మరీ చంద్రబాబు గవర్నర్‌ని కలిసారా అంటూ రాజకీయ వర్గాలలో చర్చలు మొదలయ్యాయి. అయితే దీనిపై టీడీపీ నేతలు మాత్రం భిన్నంగా స్పందిస్తూ చంద్రబాబు గవర్న్‌ర్ కలిసిన దానిపై వివరణను ఇచ్చుకున్నారు. ఏపీలో ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ విజయం సాధించడం, టీడీపీ ఓడిపోయిన కారణం చేత చంద్రబాబు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాను కేవలం లేఖ ద్వారా ఫ్యాక్స్‌లో పంపారు. అందుకే నేడు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసారని చెబుతున్నారు టీడీపీ నేతలు. అయితే వీరు ఎన్ని చెప్పినా గవర్నర్‌ను చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారా? లేక వేరే ఏదైనా విషయం గురించి మాట్లడడానికి కలిసారా అనే దానిపై ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో హాట్ టాఫిక్‌గా మారిపోయింది.