పెద‌బాబు, చిన‌బాబు ఇద్ద‌రి టార్గెట్ ఆ మంత్రి!!

Thursday, February 16th, 2017, 09:22:14 PM IST


ఎర్ర‌న్నాయుడు త‌ర్వాత శ్రీ‌కాకుళం జిల్లాలో అంత పేరున్న నేత అచ్చెన్నాయుడు. తేదేపా కార్మిక మంత్రిగా ఆయ‌న పెద్ద ప‌ద‌వినే వెల‌గ‌బెడుతున్నారు. అయితే ఇటీవ‌లి కాలంలో పార్టీలో ఆయ‌న ప్ర‌భ పూర్తిగా త‌గ్గిపోయింది. పైపెచ్చు పెద‌బాబు, చిన‌బాబు ఇద్ద‌రికీ ఆయ‌న శ‌త్రువు అయిపోయాడ‌న్న టాక్ వినిపిస్తోంది. ప‌లుమార్లు ఇప్ప‌టికే చంద్రాబు నాయుడు అచ్చెన్న‌పై సీరియ‌స్ అయ్యార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. లోకేష్ సైతం అచ్చెన్నాయుడు వ్య‌వ‌హారాల‌పై సీరియ‌స్‌గానే ఉన్నారుట‌. జిల్లాలో ప‌లు సంద‌ర్భాల్లో అచ్చెన్నాయుడు వ్య‌వ‌హార శైలిపై తీవ్రమైన ఫిర్యాదులు అధిష్ఠానానికి అంద‌డంతో ఆ ఇద్ద‌రూ చాలా సీరియ‌స్‌గా ఉన్నార‌న్న టాక్ వినిపిస్తోంది.

అయితే అస‌లేం జ‌రుగుతోంది. అచ్చెన్న అంద‌రినీ క‌లుపుకుపోవ‌డంలో ప‌దే ప‌దే విఫ‌ల‌మ‌వుతున్నాడు. అంతేకాదు గతంలో ఇసుక రీచ్‌ల వ్య‌వ‌హారంలో ఆయ‌న తీరు ప్ర‌జ‌ల్లో అభాసుపాలైంది. వంశ‌ధార ప్రాజెక్టు విష‌యంలో అల‌క్ష్యం చంద్ర‌బాబు దృష్టికి వ‌చ్చింది. చంద్ర‌న్న భీమా విష‌యంలోనూ అచ్చెన్న వ్య‌వ‌హార శైలిపై ప‌రోక్షంగా బాబు సీరియ‌స్ అయ్యారు. అయితే అచ్చెన్న ప్ర‌తిసారీ ఇలా కాక‌తాళీయంగా దొరికిపోతున్నారా? లేక వేరే ఏదైనా క‌థ ఉందా? అన్న చ‌ర్చ పార్టీలో సాగుతోంది. అచ్చెన్న‌కు జిల్లాలో ప‌లువురు ముఖ్య‌నేత‌ల‌తో విభేధాలు ఉండ‌డం పెద్ద‌ మైన‌స్ అవుతోంది. మంత్రి హోదాలో ఉన్న అచ్చెన్నాయుడు జిల్లా క‌లెక్ట‌ర్ స‌హా జిల్లా స్థాయి అధికారుల‌పైనా మండిప‌డుతుండ‌డం సీఎం దృష్టికి వ‌స్తున్నాయ‌ని అందుకే ఇలా చంద్ర‌బాబు టార్గెట్ చేశార‌ని చెప్పుకుంటున్నారు.