బ్రేకింగ్: చంద్రబాబు వారితో కాళ్ళబేరానికి రాబోతున్నరా..!

Monday, June 3rd, 2019, 12:43:35 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంటే, టీడీపీ మాత్రం ఘోర పరాభవాన్ని చవి చూసింది. అయితే ఈ ఎన్నికలలో ప్రధానంగా మూడు పార్టీలు బరిలో ఉన్నా గెలుపు మాత్రం టీడీపీ, వైసీపీల మధ్యనే కనిపించింది. అయితే ఎన్నికల ఫలితాలకు ముందు కొన్ని సర్వేలు వైసీపీదే విజయమని చెప్పగా, మరికొన్ని సర్వేలు మాత్రం టీడీపీదే విజయమని చెప్పాయి. అయితే అందరూ అనుకున్న అంచనాలను, సర్వే ఫలితాలను తలదన్నేలా వైసీపీ ఏకంగా 175 అసెంబ్లీ స్థానాలకుగాను 151 స్థానాలను గెలుచుకుని విజయ దుందుభి మోగించింది. అంతేకాదు నాలుగు రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం కూడా చేశారు.

ఇదిలా ఉండగా ఈ ఎన్నికలలో ఘోరంగా ఓటమి పాలైనా చంద్రబాబు ఏం చేయబోతున్నారనేదే పెద్ద చర్చానీయాంశంగా మారింది. అయితే కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకోవడంతో అసలు పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అయినా ఉంటారా లేక వారు కూడా పార్టీ మారుతారా అనే సందేహాలు ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతున్నాయి. అయితే గతంలో టీడీపీకి బీజేపీ మద్ధతు ఇచ్చినా ఈ సారి మాత్రం చంద్రబాబు ఆ మద్ధతును కోల్పోయారు. బీజేపీతో సంబంధం తెంచుకున్న ఆయన మోదీనీ ఎలా పడితే అలా మాట్లాడడంతో ఇప్పుడు బీజేపీ నేతలతో పాటు మోదీ కూడా చంద్రబాబుపై పీకల్లోతు కోపంతో ఉన్నట్టు అర్ధమవుతుంది. ఆ కోపానికి తోడుగా ఏపీలో చంద్రబాబు ఓడిపోయి జగన్ గెలవడం, కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చి మోదీ రెండవ సారి ప్రధాన మంత్రిగా కావడంతో ఆ కోపం ఇంకా బలంగా మారిపోయింది.

అయితే అటు జగన్ చంద్రబాబు చేసిన అవినీతిని భయటపెడతానని చెబుతుంటే, ఇటు కేంద్రంలో టీడీపీనీ ఎలాగైనా దెబ్బకొట్టాలని టీడీపీ సీనియర్ నేతలను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి రంగం సిద్దం చేసుకుంది బీజేపీ. అయితే ఇదివరకే భూ కుంబకోణం, ఓటుకు నోటు కేసులు చంద్రబాబును వెంటాడుతూనే ఉన్నా ఇప్పుడు జగన్, మోదీలు వాటిని కూడా తెరపైకి తీసుకురావాలనే ఆలోచనలు చేస్తున్నారట. అయితే ఇప్పటికే పార్టీనీ ఎలా కాపాడుకోవాలి అనే దానిపై చంద్రబాబు సందిగ్దంలో ఉండగా, ఇప్పుడు కేసులంటూ చంద్రబాబును మరింత భయపెట్టే యోచనలో ఉన్నారు మోదీ, జగన్. అయితే ఇదే కనుక జరిగితే చంద్రబాబు రాజకీయ పరిస్థితి పెద్ద ఇరకాటంలో పడుతుందని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారట. ఇదంతా జరగకుండా ఉండాలంటే చంద్రబాబు ఇప్పటికైనా మోదీ ముందు మోకరిల్లుతే తప్పా భయటపడే అవకాశాలు తక్కువ అని తెలుస్తుంది. ఒక వేళ చంద్రబాబు మోదీ ముందు మోకరిళ్ళినా క్షమించి వదిలేస్తారా లేక బాబును కటకటలా పాలుచేస్తరా అనేది మాత్రం ఎవరికి అర్ధం కావడంలేదట.