ఈ సీఎం ఒక్క సమస్య పైనైనా మాట్లాడుతున్నారా? – చంద్రబాబు

Friday, April 9th, 2021, 07:40:04 AM IST

తిరుపతి పర్యటన లో ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పార్టీ వైసీపీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుపతి పవిత్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పాటు పడాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ప్రచారం నేపథ్యం లో చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తి లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ రెండేళ్ళ పాలనా విధానం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అరాచక శక్తులను అడ్డుకొనే ఆయుధం ప్రజల చేతిలోనే ఉందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రామతీర్థం లో కోదండ రాముడి విగ్రహం తల ధ్వంసం చేసిన పది రోజుల తర్వాత అక్కడికి వెళ్తే తన పై అక్రమం గా కేసు పెట్టారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ సీఎం ఒక్క సమస్య పైనైనా మాట్లాడుతున్నారా అంటూ చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నించారు.

అయితే ప్రత్యేక హోదా పై జగన్ ఇప్పుడు మాట్లాడుతున్నారు అని, అయితే హోదా గురించి అడిగేవారు కాకుండా, సాధించే వారు కావాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఒక ఎంపీ స్థానం లో తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి గెలిస్తే పార్టీ బలపడుతుంది అనే ఆలోచన తో తిరుపతి రాలేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ అరాచక పాలన కి అడ్డుకట్ట వేయాలంటే ప్రజలు ఓటు అనే ఆయుధానికి పదును పెట్టాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ నేతలు మాత్రం తమ ఎంపీ అభ్యర్ధి భారీ మెజారిటీ తో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో విజయం సాధిస్తారు అని అంటున్నారు.