యువజన దినోత్సవం సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్న యువతకి శుభాకాంక్షలు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రపంచం లో ఏ దేశానికి లేని యువత భారత దేశం సొంతం అని, అపారమైన మేధస్సు, శక్తి సామర్ధ్యాలు కలిగిన మన యువత కోసం తెలుగు దేశం ప్రభుత్వం హయం లో నైపుణ్యాల అభివృద్ధిక ప్రాధాన్యత ఇచ్చాం అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రం లో ఐటీ రంగం అభివృద్ధి ద్వారా, దేశ విదేశాల్లో తెలుగు యువత ప్రతిభ కి స్థానం లభించేలా చేశాం అని అన్నారు.
అయితే నవ్యాంధ్ర లో ఐదేళ్లలో 16 లక్షల కోట్ల పెట్టుబడుల తో 30 లక్షల ఉద్యోగాల కల్పనలు కృషి చేసినట్లు వివరించారు. ఆ కష్ట ఫలితంగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టినట్లు చెప్పుకొచ్చారు. 10 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించిన విషయాన్ని వెల్లడించారు.అయితే అలాంటిది వైసీపీ పాలన లో ప్రభుత్వ భవిష్యత్ ప్రశ్నార్ధకం అయింది అని,పెట్టుబడులు, కంపెనీ లను తరిమేశారు అని, యువజన సంక్షేమ పథకాలను రద్దు చేశారు అని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి అవకాశాలకు గండి కొట్టారు అని, వేలాది మంది పై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపారు అని అన్నారు. అయితే రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యత యువతరం తీసుకోవాలి అని, పాలకుల దుశ్చర్యలు పై అన్ని వర్గాల ప్రజలను చైతన్య పరచాలి అని అన్నారు.
అలాంటిది గత 19నెలల వైసీపీ ప్రభుత్వ పాలనలో యువత భవిష్యత్తు ప్రశ్నార్ధకమైంది. తెలుగుదేశం తెచ్చిన పెట్టుబడులు, కంపెనీలు అన్నింటినీ తరిమేశారు. యువజన సంక్షేమ పథకాలను రద్దు చేశారు. యువత స్వయం ఉపాధి అవకాశాలకు గండికొట్టారు. వేలాది యువతీయువకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపారు.(3/5)
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) January 12, 2021