వైసీపీ సర్కార్ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది – చంద్రబాబు

Tuesday, May 4th, 2021, 07:34:23 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే రాష్ట్రం లో భారీగా పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరియు మరణాల తో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మే 5 వ తేదీ నుండి పగటి పూట కర్ఫ్యూ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రంలో పరిస్థితుల పై ప్రతి పక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లాక్ డౌన్ కి చర్యలు చేపట్టాలని అన్నారు. అయితే రాష్ట్రంలో వ్యాపించిన అతి ప్రమాదకర N440K రకం కరోనా వైరస్ అన్నిటికంటే 10 రెట్లు ప్రభావం చూపిస్తుంది అని వ్యాఖ్యానించారు. అయితే వాక్సినేషన్ కోసం ఇతర రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆర్డర్లు పెడుతున్నా, వైసీపీ సర్కార్ మాత్రం ఏమీ పట్టనట్టు గా వ్యవహరిస్తోంది అంటూ చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కార్యాలయాలకు రంగుల కోసం 3 వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారు అంటూ ధ్వజమెత్తారు. అయితే ప్రజారోగ్యం పై దృష్టి పెట్టాలి అని, వైద్య సిబ్బంది కొరత తీర్చేందుకు నియామకాలు చేపట్టి ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సరఫరా పెంచాలి అంటూ డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.