కేసీఆర్ చాలా రోజులు తర్వాత కౌంటర్ ఇచ్చిన బాబు

Wednesday, October 9th, 2019, 08:20:01 PM IST

రాజకీయాలు అంటేనే కౌంటర్లు ప్రతి కౌంటర్లు తప్పనిసరి, ముఖ్యంగా అగ్రనేతలు విషయానికి వస్తే విమర్శలు వచ్చిన వెంటనే దానిని ఖండిస్తూ, వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు, అయితే చంద్రబాబు నాయుడు విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలకి చాలా ఆసల్యంగా చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యాడు. గతంలో ఒకసారి కేసీఆర్ మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర రాజధానిలో నిర్మిస్తున్న అమరావతి నగర డెడ్ ఇన్వెస్ట్ మెంట్ గా పేర్కొంటూ మాట్లాడిన విషయం అందరికి తెలుసు.

తాజాగా చంద్రబాబు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ దేశంలోనే అత్యంత సౌకర్యవంతమైన నగరాల్లో హైదరాబాద్ ఒకటి, ఆనాడు నేను హైదరాబాద్ లో ఉపయోగించిన సక్సెస్ ఫార్ములాను అమరావతిలోనూ కొనసాగించాలని భావించినట్లు చెప్పారు. కేసీఆర్ చెప్పినట్లుగా తాను ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ను డెడ్ ఇన్వెస్ట్ మెంట్ గా అనుకొని ఉంటే.. కేసీఆర్ ఈ రోజు ఉన్నంత హ్యపీగా ఉండేవారు కాదు. హైదరాబాద్ రూపురేఖలు మారిపోయేలా ఐటీ నగరాన్ని నిర్మించటం వల్లే.. ఈ రోజు దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒకటైందన్నారు” చంద్రబాబు.