నా సౌండ్ ఏమి తగ్గదు..రీ సౌండ్ వినిపిస్తా..? అసెంబ్లీ లో చంద్రబాబు

Thursday, June 13th, 2019, 03:24:21 PM IST

2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో దారుణంగా ఓడిపోయింది. 175 స్థానాల్లో పోటీచేస్తే 23 మంది మాత్రమే గెలిచారు. దీనితో చంద్రబాబు చాలా మానసికంగా కృంగిపోయాడనే మాటలు బాగా వినిపించాయి. దాని నుండి తేరుకోవడానికి బాబుకే కొంచం సమయం పట్టిన మాట నిజమే, ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.

మొదటిరోజు గెలిచిన MLAలు అందరు ప్రమాణస్వీకారం చేశారు. ఇక రెండో రోజు స్పీకర్ ని ఎన్నుకోవటం జరిగింది. ఇక స్పీకర్ ఎన్నిక తర్వాత అధికార పక్షం తరుపున జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత, ప్రతిపక్షం తరుపున చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, అయితే ఆయన మాట్లాడుతున్న సమయంలో మైక్ సరిగ్గా పనిచేయలేదు. బాబు మాటలు సరిగ్గా వినిపించలేదు. దీనితో మైక్ లు పనిచేయటం లేదు. చూడండి అంటూ చంద్రబాబు మాట్లాడటం, ‘మా మైక్ లు బాగానే ఉన్నాయి, మీరే సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు, మీ వాయిస్ పెంచండి’ అంటూ అధికార పక్ష సభ్యులు మాట్లాడటం జరిగింది.

దీనితో చంద్రబాబు కొంచం నవ్వుతూ, నా వాయిస్ బాగానే ఉంది. గట్టిగానే మాట్లాడుతున్న, మైక్ లు మా సమక్ష్యంలో ఉన్నప్పుడు బాగానే పనిచేశాయి. మీ దగ్గరకి వచ్చేసరికి ఇలా అయ్యాయి. నా వాయిస్ గురించి మీరేమి భయపడవద్దు, “నా వాయిస్ సౌండ్ బాగా ఉంటుంది, ఇప్పటికంటే ఇంకా రీ సౌండ్ గట్టిగానే” వినిపిస్తాను, నాకేమి ప్రతిపక్షము కొత్తేమి కాదు. మూడుసార్లు కూర్చున్న, మీకు అధికారం కొత్త కావచ్చు. అందుకే ఇలా ఉన్నారంటూ వైసీపీకి చురకలు వేసే ప్రయత్నం చేశాడు చంద్రబాబు. ఈ వాదన నడుస్తున్నంత సేపు జగన్ మోహన్ రెడ్డి మూసి మూసి నవ్వులు నవ్వుతూనే ఉన్నాడు..