కోడెల మృతిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలి.. చంద్రబాబు డిమాండ్..!

Wednesday, September 18th, 2019, 12:29:12 AM IST

టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నిన్న చనిపోయారు. వరుస కేసుల విషయంలో మానసికంగా బాగా కుంగిపోయిన కోడెల నిన్న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో పెద్ద చర్చానీయాంశంగా మారింది. అయితే కోడెల ఆత్మహత్యపై స్పందించిన టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు మీడియాతో మాట్లాడుతూ కోడెలను మానసికంగా వేధించి చంపారని, కోడెల మృతిపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసారు. అయితే కోడెల కుటుంబంపై పెట్టిన అక్రమ కేసులకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని వైసీపీ నేతాల్ను డిమాండ్ చేసారు. అయితే వివేకా హత్య కేసును ఇంతవరకు ఎందుకు చేధించలేకపోయారని తప్పులు చేసిన వాళ్ళు చాలా మంది భయటే తిరుగుతున్నారని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్ష్య సాధింపు చేయడం దుర్మార్గమని, సమయం వచ్చినప్పుడు ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు.