జన్మభూమిపై బాబు సమీక్షా

Tuesday, September 30th, 2014, 01:56:11 PM IST

chandhra-babu

జన్మభూమి కార్యక్రమం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కల్లెక్టర్స్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు.. జన్మభూమిని అంతా కలిసి విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. జన్మభూమిలో అధికారులు ఫీల్డ్ లోకి రావాలని ఆయన కోరారు. ప్రతి గ్రామంలో జన్మభూమి కార్యక్రమం అమలు జరిగేల చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జన్మభూమి కార్యక్రమం కోసం ప్రతి జిల్లాకు సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను నియమించింది. అక్టోబర్ 2 నుంచి జన్మభూమి కార్యక్రమం ప్రారంభం కానున్నది.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను, యంత్రాంగాన్ని కోరారు.