హిడెన్ స్ప్రౌట్స్ పాటశాల కూల్చివేతకు అనుమతించడం సిగ్గుచేటు – చంద్రబాబు

Wednesday, June 9th, 2021, 01:31:54 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. అయితే విశాఖ నగరం లో ప్రతిభా వంతులకు లాభాపేక్ష లేకుండా నిస్వార్థం గా సేవ చేస్తున్న హిడెన్ స్ప్రౌట్స్ పాటశాల కూల్చివేతకు అనుమతి ఇవ్వడం సిగ్గు చేటు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈ మేరకు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ కి లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వ కూల్చివేత చర్యల్లో చోటు చేసుకున్న తాజా ఘటన అత్యంత హేయం అంటూ చెప్పుకొచ్చారు. అయితే దీనికి బాధ్యులు అయిన అధికారుల పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

అయితే భవిష్యత్ లో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. అయితే హిడెన్ స్ప్రౌట్స్ పాటశాల కి న్యాయం చేయాలని కోరారు. 2013 లో జీవి ఎంసీ లీజుకు తీసుకున్న విషయాన్ని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అయితే 190 మంది విద్యార్థులతో నడుస్తున్న ఈ పాటశాలలో ఎక్కువమంది ఆర్దికంగా వెనుకబడిన వారే ఉన్నారని పేర్కొన్నారు. అయితే ఎలాంటి నోటీసులు లేకుండా అలా కుల్చివేయడాన్ని చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. అయితే చట్టం, న్యాయం మరియు నిబందలను విస్మరించిన వైసీపీ ప్రభుత్వం అధికారం లో కొనసాగే నైతిక హక్కును కోల్పోయింది అంటూ చెప్పుకొచ్చారు.