సకాలం లో సరైన చికిత్స అందించ లేకపోయారు…రాష్ట్ర ప్రభుత్వం పై బాబు ఫైర్!

Friday, July 31st, 2020, 01:55:47 AM IST


కరోనా వైరస్ మహమ్మారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఊహించని రీతిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే సోషల్ మీడియా లో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తీరు పై చేసిన వ్యాఖ్యలు చర్చంసనేయం అయ్యాయి. అరగంట లో బెడ్ కేటాయిస్తే తన బిడ్డకు చావు వచ్చేది కాదంటూ గొల్లుమంటున్న ఆ తండ్రికి సమాధానం ఎవరు ఇస్తారు అంటూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం ను నిలదీశారు.

అందుకు సంబంధించిన ఒక వీడియో ను సైతం పోస్ట్ చేశారు. మనసు కలుక్కుమనే దుర్ఘటన ఇది అని, తిరుపతి, సప్తగిరి నగర్ కి చెందిన శేఖర్ 3 రోజులుగా ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా, అతనికి సకాలం లో వైద్యం అందించ లేకపోయారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రోజుల తరబడి పరీక్షా ఫలితాల్లో జాప్యం అని, ఫోన్ చేసిన గంటల తరబడి అంబులెన్స్ లు, బెడ్ లు లేక చెట్ల కింద రోగులు, మార్చురీ లో మృతదేహాల కుప్పలు, ఇంతకన్నా ఘోర వైఫల్యాలు ఇంకేం ఉంటాయి అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రం లో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారడం బాధాకరం అని అవేదన వ్యక్తం చేశారు.