ఈ రాష్ట్రంలో అసలు పాలనా యంత్రాంగం ఉందా?

Thursday, August 13th, 2020, 03:00:50 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పై ప్రతి పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురుదేవో భవః అని భావించే సమాజం మనది అని, అలాంటిది నెల్లూరులోని మనుబోలు జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ రమేష్‍కుమార్ గారు తనకు కరోనా పాజిటివ్ అని, ఆసుపత్రిలో చేర్చుకుని తన ప్రాణాలను కాపాడమని, ఆసుపత్రి సిబ్బందిని, అధికారులను, వైసీపీ నేతలను వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు అని అన్నారు.

అయితే చివరికి రమేష్ గారు కన్నుమూశారు. నాడు ఒక హెడ్మాస్టర్ ఉండేవారు. నేడు లేరు.ఇదేనా మీ నాడు-నేడు? అంటూ రాష్ట్ర ప్రభుత్వం పై చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఈ రాష్ట్రంలో అసలు పాలనాయంత్రాంగం ఉందా? అంటూ సూటిగా ప్రశ్నించారు. తమ ప్రాణాలను కాపాడమని వేడుకుంటూ చనిపోడానికా ప్రజలు ఓట్లేసి అధికారమిచ్చింది అని అన్నారు. వీడియోలు చూస్తుంటే బాధేస్తోంది అని, ప్రభుత్వంలో మాత్రం స్పందన లేదు అంటూ చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.