13 నెలలైనా ఇంకా వైయస్ వివేకానంద హంతకులను పట్టుకోలేకపోయారు!

Sunday, July 5th, 2020, 06:28:08 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో టీడీపీ నేతల వరుస అరెస్టులు జరుగుతున్న నేపధ్యంలో టీడీపీ కి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కొల్లు రవీంద్ర అరెస్ట వ్యవహారం పై ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకే కొల్లు రవీంద్ర ను హత్య కేసులో ఇరికించారు అని చంద్రబాబు నాయుడు ఘాటు విమర్శలు చేశారు. చీమకు కూడా అపకారం చేయని మనిషి కొల్లు రవీంద్ర అని వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం హత్య కేసులో ఇరికించెందుకు డ్రామా లు ఆడుతుంది అని చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ నేపధ్యంలో వైయస్ వివేకానంద హత్య కేసు వ్యవహారం పై మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేశారు. 13 నెలలు అయిన ఇంతవరకు వైయస్ వివేకానంద రెడ్డి ను చంపిన వారిని పట్టుకోలేకపోయారు అని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ హయం లో నిర్మించిన ఇళ్లను ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు అని ఆరోపించారు. టీడీపీ పై కక్ష సాధింపు చర్యలలో ఇది కూడా ఒక భాగం అని చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై విమర్శలు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యల పై భవిష్యత్ లో నిరశన కార్యక్రమాలతో పాటుగా పలు చర్యలు చేపడతామని చంద్రబాబు అన్నారు.