జగన్ సర్కార్ పై చంద్రబాబు సీరియస్ కామెంట్స్!

Friday, July 10th, 2020, 02:50:20 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి వైఖరి పై మరోమారు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతి పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న చర్యల పై ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం వ్యతిరేక విధానాలు పెరుగుతున్నాయి అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కి చెందిన వెంకటయ్య అని రైతు పై జరిగిన దాడి ను సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు.

వెంకటయ్య రైతు పై జరిగిన దాడి పట్ల చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వెంకటయ్య కి అండగా నిలబడడం మాత్రమే కాకుండా, అధికారులకు శిక్ష పడే వరకు వదిలిపెట్టం అని వ్యాఖ్యానించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా వెంకటయ్య ను వేధించారు అను చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అధికారుల వేధింపుల కారణం గా రైతు పురుగుల మందు తాగారు అని ఫోటోలను సైతం పోస్ట్ చేశారు. శారీరకంగా, మానసికంగా హింసించారు అని, కోర్టు కి వెళ్ళిన రైతు పై అధికారులు దాడి చేసి పగ తీర్చుకోవడం దుర్మార్గం అని అన్నారు.