ఆ విషయంలో చంద్రబాబు పక్కా ప్రూఫ్.. జగన్ రాజీనామా చేయాలట..!

Friday, July 12th, 2019, 03:00:30 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన నెలరోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు కురిపించుకుంటున్నాడు. అయితే తాజాగా ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకోవడంతో సమావేశాలు కాస్త వేడిగా మారిపోయాయి.

అయితే ఈ రోజు జరిగిన సమావేశాలలో రైతులకు విత్తనాల పంపిణిపై జరిగిన చర్చలో జగన్ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేసారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సున్నా వడ్డీకే రైతులకు రుణాలిస్తామని ప్రకటించి ఒక్కరికి కూడా ఇవ్వలేదని ఆరోపనలు చేసాడు. అయితే దీనిపై స్పందించిన చంద్రబాబు టీడీపీ హయాంలో కూడా సున్నా వడ్డీకే రైతులకు రుణాలు ఇచ్చమని దానిపై మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని వాటిని మీడియా ముందు ఉంచారు చంద్రబాబు. అయితే సున్నా వడ్డీ రుణాలకు సంబంధించిన పేపర్లు తీసుకుని వచ్చేలోపు జగన్ అసెంబ్లీని వాయిదా వేసుకుని వెళ్లిపోయారని ఇలా తప్పుడు ఆరోపణలు వేసినందుకు జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని లేదంటే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. సీఎం జగన్ అసత్యాలతో కాలం గడుపుతున్నారని ఇకనైనా పాలనపై దృష్టి సారిస్తే బాగుంటుందని హెచ్చరించారు.