జగన్ సర్కార్‌కు దిమ్మతిరిగే కౌంటర్ విసిరిన చంద్రబాబు.. మీరేం చేశారు..!

Friday, May 22nd, 2020, 12:37:38 AM IST

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిమ్మతిరిగే కౌంటర్ విసిరారు. హైదరాబాద్‌లో కూర్చుని తాను కబుర్లు చెబుతున్నానని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ సీఎం జగన్‌పై మండిపడ్డారు. నేదు ఏది మాట్లాడినా హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడుతున్నానంటున్నారు? మీరెక్కడ కూర్చున్నారు అని జగన్‌ని నిలదీశారు.

అయితే మీరు కూడా ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు కదా అంటూ ఏం చేశారు మీరు మీ ఏరియా కూడా కంటైన్మెంట్ జోన్‌లోకి వచ్చింది. రెడ్ జోన్ కిందకు వచ్చింది కదా అని నిలదీశారు. ఇదేనా మీరు సాధించిన ఘనత అని ఒకప్పుడు దేశమంతా మనల్ని ఫాలో అయ్యేవారని, ఇప్పుడు దేశానికి క్షమాపణ చెప్పే పరిస్థితి ఎదురయ్యిందని అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా సంక్షోభం వచ్చినప్పుడు నేను ఎప్పుడూ ప్రజలను వదిలిపెట్టలేదని అన్నారు.