వైసీపీ ప్రభుత్వం ఉండేది ఒకటిన్నర సంవత్సరమే – చంద్రబాబు నాయుడు

Thursday, February 25th, 2021, 05:54:19 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయితీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కుప్పంలో ఏదో సాధించామని వైసీపీ విర్రవీగుతుందని, కుప్పంపై కక్ష కట్టి టీడీపీ బలపరిచిన అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేశారని ఎవరిని వదిలిపెట్టబోమని వడ్డీతో కాదు చక్రవడ్డీతో సహా తిరిగిస్తామని చంద్రబాబు అన్నారు.

అయితే నేను కూడా ఇలాగే ఆనాడు ఉండి ఉంటే ఈ పుంగనూరు నేత అసలు ఉండేవారా అని చంద్రబాబు ప్రశ్నించారు. నేను కక్ష సాధింపు చర్యలకు ఏనాడు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. అయితే త్వరలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని ఇంకా ఒక్కటిన్నర సంవత్సరమే ఈ ప్రభుత్వం ఉండేదని అప్పుడు మా సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు. మీరు భయపెడితే భయపడడానికి ఇది పుంగనూరు, కడప కాదని ఇది కుప్పం ఖబడ్దార్ ఇక్కడ మీ ఆటలు సాగవని వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.