టీడీపీ కి గుడ్ బై చెప్పిన మరొక నేత – షాక్ లో చంద్రబాబు

Monday, August 19th, 2019, 11:43:42 PM IST

ఆంధ్రఫ్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో అప్పటి అధికార టీడీపీ పార్టీ మునుపెన్నడూ కూడా లేని విధంగా దారుణమైన ఓటమిని కూడగట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఎప్పుడైతే ఎన్నికల్లో దారుణమైన ఓటమిని చవిచూసిందో ఇక అప్పటినుండి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ కి దెబ్బ మీద దెబ్బ పడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఒకవైపు ఓటమితో కృంగిపోతున్న చంద్రబాబు కి అందరు కూడా పార్టీ మారి చాలా దారుణంగా హ్యాండ్ ఇచ్చారు అనే చెప్పాలి. ఒక్కొక్కరు కూడా వరుసపెట్టి టీడీపీ అధినేతకు షాకులు ఇవ్వడమే పనిగా పెట్టుకున్నారని చెప్పొచ్చు. టీడీపీ తరపున ఎన్నికలైన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ లో చేరగా, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొందరు టీడీపీ నేతలు అందరు కూడా బీజేపీలో చేరిపోయి చంద్రబాబు కి దెబ్బకొట్టారు. మరికొందరు కీలక నేతలు కూడా టీడీపీ కి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు కూడా వ్యాపిస్తున్నాయి.

అయితే తాజాగా మరో టీడీపీ మహిళా నాయకురాలు టీడీపీ కి గుడ్ బై చెప్పింది. మాజీ సినీ నటి, టీడీపీ నేత దివ్యవాణి సైతం పార్టీ వీడుతున్నట్లు తెలుస్తోంది. అయితే గతకొంత కాలంగా పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేత ఇటీవలే బీజేపీలో చేరగా, ఇపుడు తను దివ్యవాణి ని కూడా బీజేపీలోకి తీసుకెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారని సమాచారం. కాగా తనకి దివ్యవాణి మాటిచ్చిందని కూడా తెలుస్తుంది. కాగా ఎన్నకలకు ముందే టీడీపీలో చేరినటువంటి దివ్యవాని ఇకమీదట ఏపీలో టీడీపీకి భవిష్యత్తు లేదని తెలుసుకొని, పార్టీ మీద తనకు నమ్మకం లేకనే పార్టీ మారేందుకు నిశ్చయించుకుంది సమాచారం.